ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతల స్వీకరణ

Purandeswari: వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన పురందేశ్వరి

Update: 2023-07-13 09:29 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతల స్వీకరణ

Purandeswari: రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎలా ఉందో ప్రజలను అడిగితే తెలుస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి వైసీపీ సర్కారు తీరు పై తీవ్రంగా మండి పడ్డారు. రైతులకు 12 రూపాయలు ఇస్తామన్న జగన్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయన్నారు.

Tags:    

Similar News