Purandeswari: జనసేనతో కలిసి పనిచేద్దాం

Purandeswari: అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం

Update: 2023-08-24 05:27 GMT

Purandeswari: జనసేనతో కలిసి పనిచేద్దాం

Purandeswari: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విశాఖలోని రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ హయాంలో 3.44 లక్షల కోట్లు అప్పులు ఉండగా.. వైసీపీ హయాంలో అవి 7.44 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఏపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదని.. బీజేపీ ఆందోళన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం 980 కోట్ల నిధులను పంచాయతీలకు ఇచ్చిందని గుర్తు చేశారు. మిత్ర పక్షం జనసేనతో కలిసి పని చేయాలని పురందేశ్వరి పార్టీ కార్యకర్తలకు సూచించారు.

టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లపై నమ్మకం ఉన్నవారినే చైర్మన్‌గా నియమించాలని సూచించారు. టీటీడీలో మత మార్పిడి జరుగుతోందని, అక్కడ అడవులు నాశనం అవుతుంటే టీటీడీ పట్టించుకోవడం లేదని పురందేశ్వరి విమర్శించారు. 9సార్లు కరెంట్ చార్జీలు పెంచినా ఏపీ అంధకారంగానే ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.

Tags:    

Similar News