Pulichintala Project: ఎట్టకేలకు దొరికిన పులిచింతల గేటు
Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టులో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన గేట్ ఎట్టకేలకు దొరికింది.
Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టులో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన గేట్ ఎట్టకేలకు దొరికింది. డ్యాంమ్‌కి అరకిలోమీటర్ దూరంలో అధికారులు గేటును గుర్తించారు. మరోవైపు పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
స్టాప్ లాక్‌లో భాగంగా మొత్తం 11 ఎలిమెంట్లను నిపుణులు అమర్చనున్నారు. ఎగువ నుంచి ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుత నీటి నిల్వ 5 టీఎంసీల కంటే తక్కువగా ఉంది. ఈ పనుల నేపథ్యంలో పులిచింతల డ్యాంపైకి సందర్శకులను అనుమతించడం లేదు. పులిచింతల ప్రాజెక్టు వద్ద బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.