ఆన్‌లైన్ గేమ్స్ తో యువకలు జీవితాలు నాశనమవుతున్నాయి. పనీ పాటూ లేకుండా రోజుల తరబడి వీటికి బానిసలు అవుతున్నారు. దీంతో పాటు కొన్ని గేముల్లో డబ్బులను సైతం తగలేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో లాక్ డౌన్ నేపథ్యంలో పాఠశాలలు, మరో పని లేకపోవడం వల్ల కొంతమంది ఇదే పనిగా ఉండటంతో మరింత వ్యసనంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక యువకుడు బలయ్యాడు. బాటిల్ గ్రౌండ్ గేమ్ పబ్‌జీకి బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. దాంతో ఎడతెరిపిలేకుండా గేమ్‌లోనే మునిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డి (23) తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.