Vijayawada: ఇంద్రకీలాద్రి పై డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులు
Vijayawada: ఇక్కడే తలనీలాలు తీస్తారని భక్తులకు మోసం చేస్తున్న కేటుగాళ్లు
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రైవేట్ వ్యక్తుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తలనీలాలు సమర్పించే భక్తులను కేశఖండనశాల నుంచి తరలిస్తున్నారు. భవానీ ఐలాండ్ దగ్గర ఖర్మలు జరిగే చోటుకు తీసుకెళ్లి... తలనీలాలు ఇక్కడే సమర్పించాలని డబ్బులు వసూలు చేస్తున్నారు. కేశఖండశాలలో కాకుండా బయటకు భక్తులను తరలించడంతో ఆలయ ఖజానాకు భారీగా గండి పడుతున్నట్లు తెలుస్తోంది. భక్తులను తరలించి తలనీలాలు తీసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుర్గగుడి అధికారులు కళ్లు తెరిచారు. ఈ విషయంపై గోప్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.