చంద్రబాబుకి హౌస్ రిమాండ్ అవసరం లేదు.. ఏపీ జైళ్ల శాఖ డీజీ ప్రత్యేక లేఖ
Chandrababu: వార్డు ముందే 24 గంటలూ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాం-జైళ్లశాఖ డీజీ
Chandrababu: చంద్రబాబుకు హౌస్ రిమాండ్‌పై ఏజీకి జైళ్లశాఖ డీజీ లేఖ రాశారు. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని... ACB కోర్టు సూచన మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో.. ఏర్పాట్లు చేశామని జైళ్లశాఖ DG ఏజీకి లేఖ రాశారు. స్నేహ బ్లాక్ వద్ద మూడంచెల భద్రత, మొత్తం సీసీ కెమెరాలు పెట్టామని జైళ్లశాఖ డీజీ తెలిపారు. వార్డు ముందే 24 గంటలూ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచామన్నారు. చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీ కల్పిస్తున్నామని జైళ్లశాఖ డీజీ లేఖలో తెలిపారు.