కృష్ణాజిల్లా గన్నవరంలో రెండేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
*గన్నవరానికి చెందిన సఫీయ బేగం రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది
Andhra Pradesh: కృష్ణాజిల్లా గన్నవరంలో రెండేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహానికి నేడు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. గన్నవరానికి చెందిన సఫీయ బేగం రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. తమ కుతూరిని కొట్టి చంపారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం కమ్యూనిటీ కావడంతో అప్పట్లో చనిపోయిన రోజు పోస్ట్ మార్టం చేయలేదు. ఇప్పుడు కోర్టు అనుమతితో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. తన కూతురిని భర్త, అత్త, మామ కొట్టి చంపారని సఫీయ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.