మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
*సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ గుడిలో రాకెట్ నమూనాకు పూజలు, అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్
Sullurpet: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అరుదైన సరికొత్త ప్రయోగాలకు తెరతీసింది. ఇప్పటివరకు PSLV, GSLV లాంటి భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో ఈసారి చిన్న రాకెట్లను రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ SSLVకి రూపకల్పన చేసింది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అనవాయితీగా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. SSLV రాకెట్ నమూనాను చెంగాళమ్మ పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న సరికొత్త రాకెట్ ప్రయోగం కోసం షార్‌లో సర్వం సిద్ధమయ్యింది.