ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్: ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
MLC By Election: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
MLC By Election: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో టీచర్లు,లెక్చరర్లు 16,737 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావు, దీపక్, కవల నాగేశ్వరరావు, వెంకటలక్ష్మిలు బరిలో ఉన్నారు. గోపిమూర్తికి యూటీఎఫ్ మద్దతు ప్రకటించింది. గంధం నారాయణరావుకు ఎస్టీయూ సహా మరికొన్ని సంఘాలు మద్దతిచ్చాయి.