విజయనగరంలో పురపాలక ఎన్నికల వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్షాలు దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. గెలుపు కోసం అభ్యర్థులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మేయర్ పీఠం దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు కావాల్సిన ఎత్తులు వేస్తున్నాయి.
విజయనగరంలో పురపాలక ఎన్నికల వేడి రాజుకుంటుంది. ప్రధాన పార్టీల ప్రచారాలతో నగరం హోరేత్తుతోంది. పంచాయతీ ఎన్నిల గెలుపుతో వైసీపీ నేతలు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ నేతలకు దీటుగా ప్రతిపక్షాలు కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.
పురపాలక నుండి కార్పెరేషన్ గా మార్పు చెందాక జరుగుతున్న తోలి ఎన్నికల కావడంతో తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకోడానికి పార్టీలన్నీ ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు అన్నీ తానై శ్రేణులను నడిపిస్తున్నారు. ప్రతీ రోజు డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక అధికార వైసీపీ నుంచి అంతా తానై నడుపిస్తున్నారు విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరబద్రస్వామి. టీడీపీ ఇప్పటికే మేయర్ అభ్యర్థినిగా శమంతకమణి పేరును ప్రకటించారు. వైసీపీలో ఇంకా మేయర్ అభ్యర్ది ఎవరన్నది తెలియలేదు.
రెబల్స్ బెడద ఎక్కవగా ఉండటంతో కాస్తా వైసీపీకి తలనోప్పిగా మారింది. పార్టీలో వర్గ విబేదాలు కూడా ఎక్కువైయ్యాయి. స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరబద్ర స్వామి తన వర్గీయులకు అర్హత లేకున్నా కార్పోరేటర్ సీట్లు ఇవ్వడంతో ఎన్నో యేళ్ళుగా ఉన్న తమకు కాదని ఆయన వర్గీయులకు ఇవ్వడంతో కోలగట్లకు వ్యతిరేకంగా ఓ వర్గం రెబల్స్ గా పోటీలో నిలుచున్నారు. దీంతో అధికార వైసీపీకి రెబల్స్ తో తలనోప్పిగా మారింది. మొత్తంగా 50 డివిజన్లలో నువ్వానేనా అన్నట్లు పోటీ సాగనుండటంతో మేయర్ పీఠం ఎవరు అధిరోహిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.