Chittoor: చిత్తూరులో దొంగలుగా మారిన ఇద్దరు పోలీసులు
Chittoor: రోడ్డుపై ఉన్న షాపులోంచి బట్టలు చోరీ * బైక్‌పై పారిపోయిన ఇద్దరు కానిస్టేబుళ్లు
Chittoor: దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకొని శిక్షించాల్సిన పోలీసులు ఆ దొంగ అవతారమే ఎత్తిన ఘటన చిత్తూరులో వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.. రోడ్డు పక్కన చిన్నపాటి వస్త్రదుకాణం పెట్టుకున్నాడు. రాత్రి సమయంలో మూసేసి ఇంటికెళ్తుంటాడు. అయితే నాలుగు రోజుల క్రితం యూనిఫాం ధరించిన ఓ కానిస్టేబుల్.. సివిల్ డ్రస్‌లో ఉన్న మరో వ్యక్తి బైక్‌పై అర్ధరాత్రి దుకాణం వద్దకు చేరుకున్నారు. ఎవరూలేని సమయం చూసి.. బట్టలను చోరీ చేశారు. బైక్ ఎక్కి పారిపోయారు. మరుసటి రోజు దొంగతనం జరిగినట్టు గుర్తించిన దుకాణం దారుడు.. పక్కనే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాడు. పోలీసులే దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు.. దొంగతనానికి పాల్పడిన పోలీసులు.. దుకాణం దారుడిని బ్రతిమలాడుకోవడంతో.. ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చోరీ వీడియో వైరల్ అయింది.