కాదంబరి జత్వానీ ఫిర్యాదు: వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు

Actress Kadambari Jethwani: జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారు.

Update: 2024-09-14 11:39 GMT

Kadambari Jethwani

Actress Kadambari Jethwani: కాదంబరి జత్వానీ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు వైఎస్ఆర్ సీపీ నాయకులు కుక్కల విద్యాసాగర్ సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఆమె ఫిర్యాదు చేయడంతో 192, 218, 211, 354,220,467,420,471 రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద కేసు చేశారు.

శుక్రవారం రాత్రి పేరేంట్స్, న్యాయవాదులతో కలిసి ఆమె ఇబ్రహీంపట్నం సీఐకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు విద్యాసాగర్ తో తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తనతో పాటు తన పేరేంట్స్ ను ముంబైలో అరెస్ట్ చేశారని ఆమె చెప్పారు. ఏ తప్పు లేకపోయినా తమ కుటుంబం 42 రోజులు జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు శనివారం అందించారు.

ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు

జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. విజయవాడలో అప్పట్లో ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం. సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. ఈ కేసులో అప్పట్లో పోలీస్ శాఖలో కీలకంగా పనిచేసిన అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వారిపై కూడా విచారణ చేయనున్నారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు

వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కేసు బనాయించి తనను వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. అప్పట్లో తనపై తప్పుడు కేసుకు సంబంధించి విచారణ చేయాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. గత నెల 30న ఆమె విజయవాడకు వచ్చారు. తన న్యాయవాదులతో విజయవాడ సీపీ రాజశేఖరబాబును కలిసి ఫిర్యాదు చేశారు. తనను ఇబ్బందులకు గురిచేశారని అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్ని లపై ఆమె విజయవాడ సీపీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విచారణకు ప్రభుత్వం క్రైమ్ ఏసీపీ స్రవంతి రాయ్ ను ప్రభుత్వం నియమించింది. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఏసీపీ స్రవంతి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News