స్వర్ణ ప్యాలెస్‌ ఘటన: మొదటి రోజు ముగిసిన డాక్టర్ రమేష్ బాబు విచారణ

Update: 2020-11-30 12:20 GMT

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై మొదటి రోజు డాక్టర్ రమేష్ విచారణ ముగిసింది. ఆస్పత్రికి, హోటల్‌కు మధ్య ఎంవోయూపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఆస్పత్రి నిర్వహించామని డాక్టర్‌ రమేష్‌ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఏడీసీపీ లక్ష్మీపతి, డాక్టర్‌ రమేష్‌ న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది. ఎందుకు ఇన్నాళ్లు విచారణకు సహకరించలేదని ప్రశ్నించారు. రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులపై విచారించారు. రేపు, ఎల్లుండి కూడా డాక్టర్‌ రమేష్‌ బాబు విచారణ కొనసాగనుంది.

Tags:    

Similar News