Andhra Pradesh: భర్తే హంతకుడు.. పట్టించిన గూగుల్ టేక్ అవుట్..

Andhra Pradesh: రాధ మర్డర్ కేసులో గూగుల్ టేక్ అవుట్ కీలకంగా మారింది. ఈ కేసులో భర్తే హంతకుడనే విషయం నిగ్గు తేలింది.

Update: 2023-05-22 11:45 GMT

Andhra Pradesh: భర్తే హంతకుడు.. పట్టించిన గూగుల్ టేక్ అవుట్..

Andhra Pradesh: రాధ హత్యోదంతం మిస్టరీగా మారిన వేళ పోలీసులు మొదట కాశిరెడ్డిని అనుమానించారు. ఆ తర్వాత వారి దృష్టి మోహన్ రెడ్డి పై పడింది. భార్య పై అనుమానంతోనే హత్య చేసుంటాడని భావించిన పోలీసులు అతడిని ప్రశ్నించారు. కానీ, హత్య జరిగిన సమయంలో తాను కనిగిరిలో లేనని హైదరాబాద్ లో ఉన్నానని మోహన్ రెడ్డి తెలిపారు. అయితే గూగుల్ టేక్ అవుట్ ద్వారా మోహన్ రెడ్డి అబద్ధం చెబుతున్నాడని హత్య జరిగిన సమయంలో అతడు కనిగిరిలోనే ఉన్నాడని తెలిసింది. దీంతో పోలీసులు తమదైన స్టయిల్ లో విచారించగా రాధను తానే హత్య చేశానని మోహన్ రెడ్డి అంగీకరించాడు.

వివాహేతర సంబంధమే హత్యకు కారణమా..??

కోట రాధ, మోహన్ రెడ్డి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఉద్యోగ రీత్యా ఇద్దరు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అయితే రాధ బాల్య స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి కూడా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నాడు. ఇతడు రాధ కుటుంబానికి సన్నిహితంగా మెలిగేవాడు. ఇదిలా ఉంటే, కాశిరెడ్డికి ఉద్యోగం పోవడంతో వ్యాపారం నిమిత్తం మోహన్ రెడ్డి దంపతులు రూ.50లక్షలు అప్పు ఇచ్చారు. ఈ అప్పు తిరిగి ఇవ్వాల్సిందిగా మోహన్ రెడ్డి పలుమార్లు అడిగినా కాశిరెడ్డి నుంచి సరైన సమాధానం లేదు. ఇక ఇదే తరుణంలో భర్య రాధపై మోహన్ రెడ్డికి అనుమానం వచ్చింది.

రాధ, మోహన్ రెడ్డి ఇటీవలే జాతర నిమిత్తం రాధ స్వగ్రామం జిళ్లలపాడు వచ్చారు. భార్యను అక్కడే ఉంచి మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్లాడు. అనంతరం ఓ కొత్త సిమ్ తీసుకొని కాశిరెడ్డి చేసినట్లుగా భార్య రాధతో చాటింగ్ చేశాడు. ఈ చాటింగ్ తో రాధ, కాశిరెడ్డి మధ్య అక్రమసంబంధం ఉందని కన్ ఫామ్ చేసుకున్న మోహన్ రెడ్డి..రాధను హత్యచేసి ఆ నేరాన్ని కాశిరెడ్డిపై పడేలా పక్కా స్కెచ్ వేశాడు.

మోహన్ రెడ్డి తన ప్లాన్ లో భాగంగా డబ్బులు ఇస్తాను రమ్మంటూ రాధకు కాశిరెడ్డి మెసేజ్ చేసినట్లు చేశాడు. అది నమ్మి చెప్పిన అడ్రస్ కు వెళ్లిన రాధను కారులో కిడ్నాప్ చేసి కనిగిరి ఊరు బయట హత్య మోహన్ రెడ్డి చేశాడు. ఈ హత్యలో మోహన్ రెడ్డికి ఎవరెవరు సహకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Tags:    

Similar News