Tirumala: తిరుమల కొండపై మళ్లీ విమానం చక్కర్లు..
Tirumala: కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల కొండపై నుంచి తరచూ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
Tirumala: కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల కొండపై నుంచి తరచూ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న అన్నదాన సత్రంపై నుంచి వెళ్లిన విమానం... ఇవాళ శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని గల్లమండపం పై నుంచి వెళ్లింది. ఎప్పుడో ఓ సారి పొరపాటుగా వచ్చాయనుకుంటే ఏమోగాని... తరచూ విమానాలు చక్కర్లు కొట్టడంపై పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా.. కేంద్రం నుంచి తమకు ఎలాంటి సూచనలు రాలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.
తిరుమల కొండను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని గతంలోనే టీటీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తరుచూ కొండపై నుంచి విమానాలు చక్కర్లు కొడుతుండటం పరిపాటిగా మారింది.