పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

పిన్నెల్లి తరఫున వాదనలు వినిపించిన లాయర్‌ నిరంజన్‌రెడ్డి

Update: 2024-05-23 14:11 GMT

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. పిన్నెల్లి తరఫున లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'X'లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్‌ చేశారని, ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాయర్. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని విధుల్లో ఉన్న పోలింగ్‌ ఆఫీసర్‌ చెప్పారని కోర్టుకు తెలిపారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఇవే అంశాలు ఉన్నాయన్నారు. 'X'లో పోస్టు చేసిన వీడియో మార్ఫింగ్‌ కూడా అయ్యే ఛాన్స్ ఉందని పిన్నెల్లి తరఫు లాయర్‌ అభిప్రాయపడ్డారు. ఏడేళ్లు శిక్షపడే కేసులో నోటీసులు ఇవ్వొచ్చని.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును గుర్తుచేశారు. పిన్నెల్లి తరఫు లాయర్‌ వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు బ్రేక్‌ ఇచ్చింది.

Also Read: Mukesh Kumar Menna: మాచర్ల అల్లర్ల ఘటనపై ఈసీ చర్యలు

Tags:    

Similar News