Perni Nani: చంద్రబాబు ఓ సంస్థ సబ్ కాంట్రాక్టులతో.. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారు
Perni Nani: రాజధాని అమరావతి పేరుతో దోపిడి జరిగింది
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. ఓ ఆంగ్ల పత్రిక చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిందని పేర్ని నాని చురకలంటించారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైందన్నారు. 2016 నుంచి చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఓ సంస్థ సబ్ కాంట్రాక్టులతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారని పేర్ని వెంకట్రామయ్య ఆరోపించారు. పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని.. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని పేర్నినాని అన్నారు.