Kotamreddy Sridhar Reddy: అరెస్టులతో ప్రజా ఉద్యమాలను కట్టడి చేయలేరు
Kotamreddy Sridhar Reddy: టీడీపీ అధినేతకు మద్దతు తెలియచేస్తూ దివ్యాంగుల దీక్ష
Kotamreddy Sridhar Reddy: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబుకు మద్దతుగా దివ్యాంగులు నిరసన చేపట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలకు దివ్యాంగులు సంఘీబావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి దివ్యాంగులతో కలిసి పాల్గొని నిరసన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను కట్టడి చేయలేరన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.