Andhra Pradesh: తూర్పుగోదావరిలో ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం

* ప్రభుత్వ పథకాలకు ఈ - కేవైసీ తప్పనిసరి కావడంతో పాట్లు * సరిపడ కేంద్రాలు లేక నత్తనడకన కేవైసీ అప్‌డేట్స్‌

Update: 2021-08-23 14:15 GMT

ఆధార్ కేంద్రం వద్ద బారులు తీరిన జనాలు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ అందించే పథకాలు పేదవారు లబ్ది పొందాలంటే ఆధార్‌ లింక్‌ తప్పనిసరి చేసారు. దాంతో జనం ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 272 ఆధార్‌ కేంద్రాలలో రోజుకి పది మందికి మాత్రమే ఈ కేవైసీ అప్‌డేట్‌ చేయగలుగుతున్నారు. ఈ లెక్కలో ఈ ఒక్క జిల్లాలోనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి మరొక మూడు నెలలు సమయం పడుతుంది. కానీ ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని వాలంటీర్లు చెబుతుంటే, ఆధార్‌ కేంద్రాల వద్ద తమ పిల్లలతో ఉదయం నుండి రాత్రి వరకు పడిగాపులు పడాల్సివస్తుంది.

సెంటర్లు పెంచి ఈ అప్‌డేట్‌ లు చేయించుకునే వెసులు బాటు లేకపొతే ఈ కేవైసీ మాటేమో గానీ, కరోనా కేసులు సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు.ఇలా ప్రభుత్వం మారినా ప్రతిసారి తమకు ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు.మరి రానున్న రోజులలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో, పేద ప్రజలకు ఎంతవరకు మేలు చేసే విధంగా ముందడుగు వేస్తాయో వేచి చూద్దాం

Tags:    

Similar News