Local Body Elections: నేడు మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్

* 69 పంచాయతీలకు గానూ 30 ఏకగ్రీవం * 533 వార్డులకు గానూ 380 ఏకగ్రీవం * మిగిలిన 36 సర్పంచ్‌లు, 68 వార్డులకు పోలింగ్

Update: 2021-11-14 01:57 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు(ఫోటో - ది హన్స్ ఇండియా)

Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. నేటి నుంచి వరుసగా వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇవాళ వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్‌ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇవాళ జరిగే ఎన్నికల్లో మొత్తం లక్షా 32 మంది, మున్సిపల్‌ ఎన్నికల్లో 8.62 లక్షల మంది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8.07 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్‌ విధానంలో ఉంటాయి.

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు.

స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్‌ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించారు. ఇవాళ మొత్తం 350 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

రేపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి.

దీంతో అందరి చూపు కుప్పం ఫలితంపైనే ఉంది. ఇవి కాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్‌ కొనసాగనుంది.

Full View


Tags:    

Similar News