శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు
Srisailam: పాత ఈవో లావణ్య గుంతకల్ ఆర్డీవోగా బదిలీ
Srisailam: శ్రీశైలం నూతన కార్యనిర్వహణాధికారిగా పెద్దిరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టగా విధులు నిర్వహిస్తున్న పెద్దిరాజును శ్రీశైలం నూతన ఈఓ గా నియమించింది. భీమవరానికి చెందిన ఈవో పెద్దిరాజు 1995 సంవత్సరంలో మొదటగా శ్రీకాకుళంలో డిప్యూటీ తహసిల్దారుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టి అంచలంచలుగా ద్వారకాతిరుమల, కాళహస్తి మొదలగు పుణ్యక్షేత్రాలకు కూడా ఈవోగా పని చేశారు.ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్దిరాజును నియమించినట్టు తెలుస్తోంది. ఇదివరకు కార్యనిర్వాహణ అధికారిగా విధులను నిర్వర్తించిన ఎస్. లావణ్య తన సొంత శాఖ అయిన రెవెన్యూశాఖ కు బదిలీ చేసి గుంతకల్ ఆర్డీవో గా ప్రభుత్వం నియమించింది.