Pawan Kalyan : 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షను 11 రోజులపాటు చేపట్టనున్నారు. ఈ దీక్షలో భాగంగా ఆయన పండ్లు, ద్రవఆహారం మాత్రమే తీసుకుంటారు.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహ అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నవారు. బుధవారం నుంచి ఈ దీక్షను చేపట్టనున్నారు. మొత్తం 11 రోజులపాటు ఈ దీక్షను సాగించనున్నారు. ఈ దీక్షలో పవన్ కల్యాణ్ పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. గతేడాది జూన్ లో వారాహి విజయయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.
కాగా అటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ కు విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్ డీ రామక్రుష్ణ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయవాడలోని క్యాంపు ఆఫీసులో కమిషనర్ తోపాటు డీసీపీ ఆదిరాజ్ రాణా పవన్ను కలిసారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం దగ్గర సోమవారం పలు వర్గాల ప్రజల నుంచి పవన్ కల్యాణ్ వినతులను స్వీకరించారు.