నేడు తిరుపతికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేయనున్న జనసేనాని

Pawan Kalyan: శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేయనున్న జనసేనాని

Update: 2023-07-17 03:53 GMT

నేడు తిరుపతికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేయనున్న జనసేనాని

Pawan Kalyan: కాసేపట్లో జనసేనాని పవన్‌కళ్యాణ్‌ తిరుపతికి చేరుకోనున్నారు. ఇటీవల జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేసేందుకు ఆయన తిరుపతి ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. 10 గంటలకు పాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్కు కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా రేణిగుంట జంక్షన్ మీదుగా, గాజులమండ్యం, తుమ్మలగుంట సర్కిల్ నుంచి టౌన్ క్లబ్ చేరుకోనున్నారు పవన్‌. తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డికి సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఎస్పీ ద్వారా డీఐజీకి ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం జనసేన నేత సాయితో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు.

ఇక నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే సీఐ అంజూ యాదవ్‌ జనసేన నేత సాయిపై చేయిచేసుకున్న అనంతరం మరింత వైరల్‌గా మారారు. వరుసగా సీఐకి సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఐ అంజూ యాదవ్‌కి ఛార్జ్‌మెమో జారీ చేశారు ఉన్నతాధికారులు. జనసేన నేతపై చేయి చేసుకున్న అనంతరం.. సీఐ అంజూ యాదవ్‌ లీవ్‌లో ఉన్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ వచ్చే వరకే సీఐపై చర్యలు తీసుకుంటారా... లేక పవన్‌ ఇచ్చే ఫిర్యాదును బట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News