Pawan Kalyan: ఆడబిడ్డలపై దురాగతాలు.. ప్రభుత్వానికి స్పందించాల్సిన బాధ్యత లేదా?

Pawan Kalyan: మహిళల అత్యాచారాలపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది దిశ చట్టాలు, దిశ పీఎస్‌లు ఏమాత్రం రక్షణ ఇవ్వడంలేదు

Update: 2023-09-27 13:11 GMT

Pawan Kalyan: ఆడబిడ్డలపై దురాగతాలు.. ప్రభుత్వానికి స్పందించాల్సిన బాధ్యత లేదా?

Pawan Kalyan: ఏపీలో ఆడ బిడ్డలకు రక్షణ కరువైందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి మహిళల రక్షణపై చిత్తశుద్ధి లేదన్నారు. మహిళల అత్యాచారాలపై ప్రభుత్వం మౌనం వహిస్తోందని మండిపడ్డారు. దిశ చట్టాలు, దిశ పీఎస్‌లు ఏమాత్రం రక్షణ ఇవ్వడంలేదని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో దళిత బాలికపై..గ్యాంగ్‌రేప్‌ తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులు కూడా పాలక పక్షం కట్టేస్తోందన్నారు పవన్ కల్యాణ్.

Tags:    

Similar News