Pawan Kalyan on Photo and Video graphers Issue: ఫొటో, వీడియో గ్రాఫర్లను ఆదుకోవాలి

Pawan Kalyan on Photo and Video graphers Issue: లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాలతో పాటు ఫొటో, వీడియో గ్రాఫర్లపై ఎఫెక్ట్

Update: 2020-07-05 03:21 GMT
Pawan Kalyan (File Photo)

Pawan Kalyan on Photo and Video graphers Issue: లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాలతో పాటు ఫొటో, వీడియో గ్రాఫర్లపై ఎఫెక్ట్ పడిందని, దీనివల్ల వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని జనసేన అధినేత వపన్ కల్యాణ్ పేర్కొన్నారు. వీరికి వీలైనంత వరకు సాయం చేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఫొటో, వీడియో గ్రాఫర్లకు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు. కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని పవన్‌ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అందించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఆర్థిక సాయం అందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. స్వయం ఉపాధిలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలను ఆధారంగా చేసుకున్నవారు కరోనా మూలంగా ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటున్నారన్నారు. వివాహాది శుభకార్యాలు ఉన్న మంచి రోజులన్నీ లాక్డౌన్‌లోనే పోయాయన్నారు. వారికి నాలుగు డబ్బులు సంపాదించుకొనే సమయంలో స్టూడియోలను మూసివేయాల్సి వచ్చిందని పవన్ పేర్కొన్నారు.

ఈ పరిణామంతో వారంతా ఆదాయం లేక అప్పు దొరికే అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో 25 మంది చనిపోయారని, అందులో కొందరు ఆత్మహత్య చేసుకొంటే, మరికొందరు ఒత్తిడికి లోనై గుండెపోటుతో చనిపోయారని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ రంగంలో ఉన్నవారికి ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అందించడంతో పాటు స్వయం ఉపాధి కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News