Pawan Kalyan: ఇవాళ పిఠాపురంలో జనసేనాని నామినేషన్‌

Pawan Kalyan: వేలమందితో ర్యాలీగా తరలిరానున్న పవన్ కల్యాణ్

Update: 2024-04-23 02:10 GMT

Pawan Kalyan: ఇవాళ పిఠాపురంలో జనసేనాని నామినేషన్‌ 

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇవాళ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలి వెళ్లి పవన్‌ నామినేషన్‌ వేస్తారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు

Tags:    

Similar News