Pawan Kalyan: కరోనా వైరస్.. జనసేనాని కీలక ప్రకటన
Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఆందోళనకరంగా ఉన్నాయని పవన్ అన్నారు.
Pawan Kalyan: కరోనా బారిన పడి పవన్ కళ్యాణ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుట పడుతోందని తెలిపారు. తన క్షేమాన్ని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, అత్యవసర ఔషధాలు, బెడ్స్ కొరత ఉండటం దురదృష్టమన్నారు. ఏపీలో బెడ్స్ కొరతపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
రెండ్రోజులక్రితం కోవిడ్ పరీక్షలు చేయించుకున్న పవన్‌కు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. దాంతో, పవన్ కల్యాణ్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అపోలో ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స జరుగుతోంది. పవన్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తోపాటు నిమ్ము చేరడంతో ఆక్సిజన్ అందిస్తూ ప్రత్యేక వైద్య బృందం ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఇక, పవన్ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ ఫామ్‌హౌస్‌లో చికిత్స జరుగుతోంది.
ఈనెల 3న తిరుపతి సభ తర్వాత పవన్ అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, అప్పుడు కరోనా నెగిటివ్ రావడంతో ముందుజాగ్రత్తగా అప్పట్నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ వచ్చారు. అయితే, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో రెండ్రోజులక్రితం మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈసారి పాజిటివ్ రావడంతో వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు.