Pawan Kalyan Demands: కుల వృత్తులను ఆదుకోవాలి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan Demands: లాక్ డౌన్ సమయంలో అందిరి మాదిరిగానే స్వర్ణకారులు సైతం తమ కుల వృత్తికి దూరమయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Update: 2020-07-01 03:15 GMT

Pawan Kalyan Demands: లాక్ డౌన్ సమయంలో అందిరి మాదిరిగానే స్వర్ణకారులు సైతం తమ కుల వృత్తికి దూరమయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వీరిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకవాలన్నారు. ప్రస్తుతం ఆన్ లాక్ లో ఉన్నా వారి ఉపాధి ఏ మాత్రం మెరుగుపడ్డ దాఖలాలు లేవన్నారు.

లాక్ డౌన్ సమయంలో స్వర్ణకారులు తమ ఉపాధికి దూరమయ్యారని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కుల వృత్తిపై జీవనం గడుపుతున్న ఇలాంటి వారిపై పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వ్యాప్తి కారణంగా మరికొన్ని నెలల పాటు ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేసుకునే స్థితిలో లేరని, బంగారు, వెండి ఆభరణాల తయారీకి విఘాతం ఏర్పడుతోందని అన్నారు. రాష్ట్రంలో 14 లక్షల స్వర్ణకార, విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడిచారు. స్వర్ణకారులకు ఇది నిజంగా కష్టకాలమేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అంతేకాదు, జీవో 272 కారణంగా పోలీసుల చేతిలో స్వర్ణకారులు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. అనవసరపు వేధింపులతో స్వర్ణకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని పోలీసులకు హితవు పలికారు. తప్పేదైనా ఉంటే స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని స్వర్ణకారులు కోరుతున్నారని వెల్లడించారు. 


Tags:    

Similar News