ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఆగిన చోట నుంచే ప్రారంభిస్తామని ఎస్‌ఈసీ ప్రకటించడంతో ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గత నామినేషన్‌లో అధికార పార్టీ దౌర్జన్యం వల్ల అనేక మంది పోటీకి దూరమైయ్యారని తెలిపారు. పాత నోటిఫికేసన్ కొనసాగింపుపై పునరాలోచించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇక గ్రామాల్లో జనసేన బలంగా ఉందనేందుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందన్నారు. తొలి రెండు దశల్లో చూపిన స్ఫూర్తి మలి దశల్లోనూ చూపాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.