Pawan Kalyan: ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ ఆర్థిక సాయం
Pawan Kalyan: రాష్ట్రంలో ఇటీవల తీవ్ర దుమారం రేపటి ఇప్పటం వివాదంలో ఇళ్లు కూల్చివేతకు గురైన వారికి జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
Pawan Kalyan: రాష్ట్రంలో ఇటీవల తీవ్ర దుమారం రేపటి ఇప్పటం వివాదంలో ఇళ్లు కూల్చివేతకు గురైన వారికి జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో.. రోడ్డు విస్తరణ విషయంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటంలో ఒక్క ఇళ్లు కూడా పడగొట్టలేదని స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున రాజకీయ వివాదానికి దారి తీసిన ఇప్పటంలో ఆవాసాలు కోల్పోయిన వారితో పాటు.. ఇళ్లు దెబ్బతిన్న వారికి అండగా నిలవాలని.. జనసేన పార్టీ నిర్ణయించింది.
బాధితులకు ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. త్వరలోనే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆర్థికసహాయాన్ని స్వయంగా అందజేయనున్నారు. గత మార్చ్ 14 న ఇప్పటం శివారులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం ఇప్పటం వాసులు సహకరించారు. సభకోసం స్థలాలు ఇచ్చారు. దీనిపై కక్ష కట్టిన ప్రభుత్వం వారి ఇళ్లను పడగొట్టిందంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు. తర్వాతి రోజు ఇప్పటం వెళ్లేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్‌ను అడ్డుకోవడంతో తీవ్ర దుమారం రేగింది.