Pawan Kalyan: షర్మిలకు భద్రత అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. అధికారుల జోలికొస్తే సుమోటోగా కేసులు

Update: 2024-11-10 11:32 GMT

Pawan Kalyan about security to YS Sharmila: గత ప్రభుత్వం 20 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పి అధికారులను ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని వారి చేత కూడా తప్పులు చేయించారని తెలిపారు. ప్రస్తుతం అధికారులు తమ విధులను బాధ్యతతో పూర్తిచేస్తున్నారని చెబుతూ, మీరు ఇంకా వారిని బెదిరించాలని చూస్తే ఎవరూ బెదిరిపోరు అని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఒకవేళ అధికారులకు ఏదైనా హాని కలిగించాలని చూస్తే వారికి చిన్న గీత పడినా చూస్తూ ఊరుకోం అని తేల్చిచెప్పారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర అధికారులను ఇప్పటికీ కూడా బెదిరించాలని చూస్తే సుమొటోగా కేసులు పెట్టాల్సి వస్తుందని సదరు నాయకులను హెచ్చరించారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు భద్రత కల్పించే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. షర్మిల కోరితే ప్రభుత్వం వైపు నుండి ఆమె భద్రతను అందిస్తామని ఆయన స్పష్టంచేశారు.

Tags:    

Similar News