AP Elections 2021: ఏపీలో నేడు పరిషత్ ఎన్నికలు
AP Elections 2021: 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక * 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
AP Elections 2021: ఏపీలో కాసేపట్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది.515 జడ్పీటీసీ, 7 వేల 220 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగబోతుంది. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2 వేల 58 మంది అభ్యర్థులు ఉండగా ఎంపీటీసీ బరిలో 18 వేల 782 మంది అభ్యర్థులు ఉన్నారు. 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల 751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 247 నక్సల్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 6 వేల 492 సున్నిత పోలింగ్ స్టేషన్లు, 6 వేల 314 కేంద్రాలను అతి సున్నిత పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించనున్నారు అధికారులు. ఇక కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ సారి కూడా ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు.