Papikondalu: పాపికొండలు విహారయాత్ర పున:ప్రారంభం
Papikondalu: ఆరు బోట్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం * ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న బుకింగ్స్
Papikondalu: దాదాపు 21 నెలలుగా నిలిచిపోయిన పాపికొండ విహార యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను గురువారం మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి బోటింగ్‌కు బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఆరు టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చామని.. గతంలో జరిగిన ప్రమాద ఘటన దృష్ట్యా రాష్ట్రంలో బోటు షికార్ల పర్యవేక్షణకు తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి అవంతి.