Other religious material along with Sapthagiri: సప్తగిరితో పాటు అన్యమత పుస్తకం.. టీటీడీ పాలకమండలి ఫిర్యాదు

Other religious material along with Sapthagiri: ఇటీవల కాలంలో తిరుమల, తిరుపతి దేవస్థానం ఎక్కువగా పత్రికలకు ఎక్కుతోంది..

Update: 2020-07-07 08:00 GMT

Other religious material along with Sapthagiri: ఇటీవల కాలంలో తిరుమల, తిరుపతి దేవస్థానం ఎక్కువగా పత్రికలకు ఎక్కుతోంది... అన్యమత ప్రచారంతో పాటు పలు రకాలైన రూమర్స్ వ్యాపిస్తున్నాయి. వీటిని అడ్డుకోవడానికి పాలకవర్గం నిత్యం ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక రకంగా కొత్త వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా టీటీడీ సప్తగిరి పుస్తకంతో పాటు అన్యమతానికి చెందిన పుస్తకం పోస్టల్ రావడం కలకలం రేపింది. ఇది కేవలం కావాలనే కొంతమంది చేస్తున్న తప్పుడు చర్య అని, ఇలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని పాలకర్గం పోలీసులకు పిర్యాదు చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై రోజురోజుకీ కుట్రలు పెరిగిపోతున్నాయి. అడుగడుగునా అన్యమత ముద్ర వేసేందుకు కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో అనేక సార్లు తిరుమల శ్రీవారు, ఆలయంపై అవాస్తవ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. వాటిని ఖండించిన టీటీడీ అసత్య కథనాలపై ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా మరోసారి తమకు సంబంధం లేకున్నా టీటీడీ మరోసారి వార్తల్లో నిలిచింది. గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి టీటీడీ మాస పత్రిక సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం రావడం కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టీటీడీ.. ఇది దురుద్దేశ చర్య అంటూ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు.

కాగా సప్తగిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, డెలివ‌రీ భాధ్య‌త మొత్తం పోస్ట‌ల్ శాఖ‌వారే చూస్తారన్న విషయం తెలిసిందే. పోస్ట‌ల్ శాఖ‌కు పోస్టేజి చార్జీల‌తో పాటు ఒక్కో ప్ర‌తికి అద‌నంగా రూ. 1.05 టీటీడీ అద‌నంగా చెల్లిస్తోంది. ఇక గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా.. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని తమిళ నటుడు శివకుమార్‌ ప్రచారం చేశారని తమిళ్‌మయ్యన్‌ అనే వ్యక్తి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News