Local Body Elections 2020: మరోసారి ఆర్డినెన్స్.. స్థానిక సంస్థల ఎన్నికలపై జారీ
Local Body Elections 2020: మార్చిలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కాలపరిమితి ముగియడంతో కొత్త దాన్ని తీసుకొచ్చారు.
Local Body Elections 2020: మార్చిలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కాలపరిమితి ముగియడంతో కొత్త దాన్ని తీసుకొచ్చారు. గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయక ముందు ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని అప్పట్లో సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అన్నారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చామని వివరించారు. డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్ తెచ్చామని అన్నారు. డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని... వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని సీఎం జగన్ వెల్లడించారు.అప్పట్లో దీనిపై ప్రతిపక్ష పార్టీ పలు ఆరోపణలు చేసింది. కావాలనే తన సభ్యులను అనర్హులగా ప్రకటించేందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా అప్పట్లో చేసిన ఆర్డినెన్స్ కు సంబంధించి కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయడం, దానికి కాలపరిమితి ముగియడంతో మరోసారి తీసుకురాక తప్పలేదు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలోని సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్.. ఆరు నెలల్లో చట్టరూపం దాల్చకపోవడం.. అంతేకాకుండా ఆ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియడంతో మరోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసే అభ్యర్ధులపై అనర్హత వేటు వేసే విధంగా ఈ ఆర్డినెన్స్‌లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వ్యవధిని కూడా 13 నుంచి 15 రోజులకు కుదించింది.