East Godavari: పండ్ల బుట్టలా కనిపిస్తున్న కమలా మొక్కలు

East Godavari: అలంకరణలో ముందుంటున్న కమలా మొక్కలు

Update: 2023-02-12 03:15 GMT

East Godavari: పండ్ల బుట్టలా కనిపిస్తున్న కమలా మొక్కలు

East Godavari: మనకు కుండీలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుంచి పాతిక కాయలు ఉంటాయి. అలాంటిది కుండీలో ఉండే ఒకే చెట్టుకు రెండు వేల కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తూర్పుగోదావరి జిల్లా కడిపులంక శివంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమలా చెట్లు సందడి చేస్తున్నాయి. కుండీలో ఉండే చెట్టుకు రెండు వేల కాయలు ఉంటాయా? అనే అనుమానం వ్యక్తం చేసే వాళ్లు వచ్చి లెక్క పెట్టుకోవచ్చు .కాస్త అటు ఇటుగా లెక్క సరిపోతుందని రైతు చెబుతున్నారు.

మంచి దిగుబడే కాకుండా అలంకరణలో ముందుంటాయి ఈ మొక్కల చెట్లు. కార్పొరేట్ సంస్థలు,ఫంక్షన్ హల్స్ వద్ద వీటిని ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్నారు. ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు ఉండే ఈ చెట్టు ధర ఎంతో తెలుసుకోవాలని ఉంది కదా. ఒక్కొక్క చెట్టు పాతిక నుంచి ముపైవేల రూపాయలు పలుకుతుంది. అరుదైన ఈ మొక్కలను మన దేశ నర్సరీ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని దిగుమతి చేస్తున్నట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.

Tags:    

Similar News