Opinion On Changes in Inter Syllabus: ఇంటర్ మార్పులపై అభిప్రాయ సేకరణ
Opinion On Changes in Inter Syllabus: కరోనా వైరస్ విలయంలో అన్ని చోట్లా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Opinion On Changes in Inter Syllabus: కరోనా వైరస్ విలయంలో అన్ని చోట్లా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పాటు విద్యా విధానంలో సైతం మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా ఏపీలో ఇంటర్ విద్యలో గత మాదిరి కాకుండా యూనిట్ టెస్ట్ లు నిర్వహించి, ఎప్పటికప్పుడు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇకపై ఇంటర్మీడియట్‌లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు రెడీ చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. సబ్జెక్టుకు ఒక వర్క్‌బుక్‌ను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా మల్టిపుల్ ఛాయిస్ క్వచ్చన్స్, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.
ఆగస్టు 3 నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్ క్యాలండర్-2021ను సిద్ధం చేసింది. కళాశాలల్లో ఉదయం సైన్సు, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. తమ పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలు వీటిని మార్పు చేసుకోవచ్చు. కళాశాలలు మొత్తం 196 రోజులు పని చేయనున్నాయి.
సీబీఎస్‌ఈ తరహాలో 30% పాఠ్యాంశాలు తగ్గిస్తారు.రెండో శనివారమూ పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటాయి. విద్యార్థులకు యూనిట్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలకు వీడియోలను రూపొందిస్తారు. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఈ మహమ్మారి విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా మూతపడిన స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలు కారణంగా విద్యార్ధులు భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది.ఈ క్రమంలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ విద్యారంగాన్ని మాములు స్థితికి తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సంచలన మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంవత్సరం రూపకల్పన, కాలేజీల పునః ప్రారంభం, పనిదినాలు, సిలబస్ కుదింపు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనా విధానాలు, కోర్సుల్లో మార్పులు చేర్పులు వంటి విషయాలపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, లెక్చరర్స్, విద్యారంగ నిపుణల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించాలని భావిస్తోంది. ఆసక్తి గలవారు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా వారి అభిప్రాయాలను జులై 31, 2020 సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని తెలిపింది. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని.. ఆ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది.