Tirumala: తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ ‘చిరుత’
Tirumala: గుంపులుగుంపులుగా కాలినడకన వెళ్తోన్న భక్తులు
Tirumala: తిరుమలలో బాలికపై చిరుత దాడి చేయడంతో.. చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ అధికారులు. నిన్నటి నుంచి ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికల మానిటరింగ్ చేస్తున్నారు. ఇవాళ మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు దగ్గర ఉదయం 6 గంటల 30 నిమిషాలకు చిరుత తారసపడింది. దాంతో వెహికల్ సైరన్ వేసి చిరుతను అడవిలోకి తరిమారు విజిలెన్స్ సిబ్బంది. తిరుమల కొండకు వెళ్లే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా.. గుంపులుగుంపులుగా కాలినడకన వెళ్తున్నారు భక్తులు.