ఫలించిన ఆపరేషన్ కాంబోడియా.. విశాఖకు చేరుకున్న కాంబోడియా బాధితులు

Operation Cambodia: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కొలిక్కొచ్చింది.

Update: 2024-05-25 07:15 GMT

ఫలించిన ఆపరేషన్ కాంబోడియా.. విశాఖకు చేరుకున్న కాంబోడియా బాధితులు

Operation Cambodia: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కొలిక్కొచ్చింది. విశాఖ పోలీసుల చొరవతో కంబోడియా నుంచి బాధితులు విశాఖకు చేరుకున్నారు. ఓవైపు కాంబోడియ అధికారులు, మరోవైపు ఇండియన్ ఎంబసీ, పోలీస్ అధికారుల సమిష్టి కృషి‌తో ఆపరేషన్ కాంబోడియా విజయవంతమైంది.

నిరుద్యోగ యువతకు గాలం వేసి ఉపాధి పేరిట కాంబోడియాకు తీసుకెళ్లి అక్కడ సైబర్ నేరాలు చేసేలా ట్రైనింగ్ ఇచ్చి...వారితో నేరాలు చేయించడం కాంబోడియా గ్యాంగ్ పని. చైనీస్ గ్యాంగ్ ఆధీనంలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడిన బాధితులు ఇప్పుడు విశాఖ పోలీసులు చొరవతో సొంత ఊళ్లకు చేరారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో విశాఖ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి చైనీస్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు.

కాంబోడియా నుంచి విశాఖకు రెండు ఫ్లైట్లల్లో 25 మంది బాధితులు చేరుకున్నారు. వారికి విశాఖ విశాఖ సీపీ రవిశంకర్ స్వాగతం పలికారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని...దానితో అసలైన నిందితులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడానికి ఉపయోగడపడుతుందని విశాఖ సీపీ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News