Vaccination: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

18 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు, రెండో డోసు

Update: 2021-08-31 06:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Vaccination: ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు, రెండో డోసు అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కోసం 2500కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 15 లక్షల కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఏపీలో ఇప్పటివరకు 2.93 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగింది.

ఏపీలో ఇప్పటివరకు 2.11 కోట్లు మంది మొదటి డోసు తీసుకోగా 81 లక్షల మందికి పైగా రెండో డోస్ తీసుకున్నారు. వారిలో 1.35 కోట్ల మంది పురుషులు ఉండగా, 1.57 మంది మహిళలు ఉన్నారు. 67 ఏళ్లపై బడిన వారిలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 67 లక్షలకు చేరుకుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 1.26 కోట్లకు చేరుకోగా.. 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 99 లక్షలకు చేరుకుంది.

Full View


Tags:    

Similar News