CID: IRR అలైన్‌మెంట్ మార్పునకు ఒత్తిడి చేశారా లేదా..?
CID: భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా..?
CID: IRR అలైన్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు... రెండో రోజు లోకేష్‌ను విచారిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలపై ప్రశ్నిస్తుంది. IRR అలైన్‌మెంట్ మార్పునకు ఒత్తిడి చేశారా లేదా... అని.. మంత్రి అవ్వగానే మిమ్మల్ని మంత్రివర్గ ఉపసంఘంలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. మంత్రివర్గ ఉపసంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారు కదా అని.. హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ది చేసేలా అలైన్‌మెంట్ ఎందుకు మార్చారన్నారు. IRR భూసేకరణ పరిహారాన్ని, భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా అని క్వశ్చన్ చేశారు సీఐడీ అధికారులు.
భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారన్న సీఐడీ అధికారులు.. ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్టు వ్యయాన్ని.. అదనంగా పెంచేందుకు సిఫార్సు చేశారా అని ప్రశ్నించారు. లింగమనేని రమేష్ మీకు ఇల్లు ఉచితంగా ఎందుకు ఇచ్చారని.. లింగమనేని భూములకు మేలు చేసినందుకే మీకు ఇంటిని క్విడ్ ప్రోకో లో ఇచ్చారు కదా అని ప్రశ్నలు సంధించారు.