Andhra Pradesh: వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం పేరు మార్పు
* డిసెంబర్ లో ప్రారంభం కానున్న పథకం * పథకంలో 67 లక్షల మందికి లబ్ది చేకూరే ఛాన్స్
OTS Scheme: ఏపి ప్రభుత్వం చేపట్టనున్న వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం పేరును జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంగా మార్చినట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం గతంలో ఇంటి స్థలం, ఇల్లు కట్టుకుని దానిని కారణాంతరాల వల్ల అమ్మేసుకున్న వారు ఆఇంటిని వెనక్కు తీసుకునే విధంగా పథకం రూపొందించారు ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 1980 నుంచి 2011 మధ్య కాలంలో ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, పట్టా తీసుకుని ఇల్లు కట్టుకుని హౌసింగ్ కార్పొరేషన్ రుణాలు తీసుకున్న వారికి రూరల్ ప్రాంతంలో అయితే పదివేలు, మున్సిపాలిటీ పరిధిలో 15 వేలు, కార్పొరేషన్ పరిధిలో 20 వేలు చెల్లిస్తే ఓటీఎస్ పథకం వర్తిస్తుంది. పట్టా ఉండి ఇల్లు కట్టుకుని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని ఎవరికైనా ఇల్లు అమ్మేస్తే రూరల్ ప్రాంతంలో 20 వేలు, మున్సిపాలిటీల్లో 30 వేలు, కార్పొరేషన్లలో 40 వేలు జమచేసి ఓటీఎస్ కింద లబ్ది పొందవచ్చు.
గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పథకం అమలు జరుగుతుందని, వచ్చే మూడు నెలల్లో ఈ పథకానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.టిడ్కో ఇళ్లకు సంబంధించి కొత్త లబ్ది దారుల ఎంపిక పూర్తి కావాలని, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లో MIG ప్లా్ట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా జగన్ కోరారు.