చిన్నారులకు ఒమిక్రాన్ ముప్పు..! ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాపించే అవకాశం..!
Omicron Live Updates: ఒమిక్రాన్ రీ ఇన్‌ఫెక్షన్ మూడు రెట్లు అధికం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వైరస్‌ను ఎదుర్కొవచ్చు..
Omicron Live Updates: కొవిడ్ న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చిన్నారుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మన దేశంలోనూ చిన్నారులలో ఇటీవల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సీజనల్ ఫీవర్లా లేక కోవిడా.. అనేది భయాందోళనలకు గురిచేస్తోంది. కోవిడ్ లక్షణాలుగా కనిపించినా.. ఒమిక్రాన్ అనే అనుమానం వెంటాడుతోంది. పక్క రాష్ట్రాలకు ఇప్పటికే ఒమిక్రాన్ చేరుకుంది. ఏపీలో పరిస్ధితి అంతా ఆల్ రైట్ అనుకోవచ్చా.. గత అనుభవాలతో సర్వం సిద్ధమేనా..
దక్షిణాప్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. ఈ సమయంలో చిన్నారుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరగడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి వల్ల పిల్లలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఎదురుకాలేదు.
మూడో వేవ్‌లో మాత్రం ఐదేళ్ల లోపు పిల్లలు, 15 నుంచి 19 సంవత్సరాల లోపు వారు ఆసుపత్రిలో ఎక్కువగా చేరారు. ప్రస్తుతం మనం మూడో వేవ్ ప్రారంభంలో ఉన్నాం. అన్ని వయస్సుల వారితో పాటు మరీ ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్న సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
60 ఏళ్లు పైబడిన వ్యక్తుల తర్వాత ఐదేళ్ల లోపు వారిలోనే కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. చిన్నారులు, గర్భిణీల్లో ఇన్ఫెక్షన్ రేటు పెరగడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్న సంకేతాలున్నాయి. లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
టీకా వేసుకున్న వారిలో లక్షణాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే భయం మాటున ఉండాల్సిన పరిస్ధితి లేదని జాగ్రత్తలు పాటించాలని తలిదండ్రులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గత నెలలో ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు సేకరిస్తోంది. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 7 వేల మందికి పైగా ప్రయాణికులు వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన ఎవరూ వైరస్ బారిన పడలేదంటున్నారు అధికారులు.