Visakhapatnam: విశాఖలో నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్లు

Visakhapatnam: మల్కాపురంలోని చమురు కంపెనీల వద్ద ఆగిన 1200 వాహనాలు *ఒక్కో ట్యాంకర్‌కు రూ.2,500 చలాన విధిస్తున్న పోలీసులు

Update: 2021-10-13 08:22 GMT

విశాఖలో నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్లు(ఫైల్ ఫోటో)

Visakhapatnam: ఒకవైపు దేశంలో విద్యుత్ కోతలు కొనసాగుతుంటే మరోవైపు విశాఖలో ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు బ్రేకులు పడ్డాయి. చమురు సరఫరా చేసే ట్యాంకర్లపై పోలీసులు ఆకారణంగా చలానాలు వేస్తున్నారని ట్యాంకర్ యాజమానులు ఆరోపిస్తున్నారు. దీంతో మల్కాపురంలోని IOC, BPCL, HPCL కంపెనీల వద్ద 1200 ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఆయిల్ ట్యాంకర్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకునే వరకు నడిపేది లేదని యూనియన్ నాయకులు చెప్తున్నారు.

మల్కాపురం నుండి షీలానగర్ వరకు 24గంటలు ఆయిల్ ట్యాంకర్లు నడపవచ్చని ఆదేశాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి సీఐ విజయ్ సాగర్ అక్రమ చలాన్లు రాస్తున్నారని యూనియన్ నాయకులు అంటున్నారు. ఒక ఆయిల్ ట్యాంకర్‌కు 2వేల 500 రూపాయలు విధించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లారీ యజమానులు వాపోతున్నారు.

Full View


Tags:    

Similar News