ఏలూరులో 500 దాటిన భాదితుల సంఖ్య
ఏలూరు ప్రజలను ఓ వింత రోగం వణికిస్తోంది. ప్రజలకు ఏ జరుగుతుందో అర్థమ్వడం లేదు. వైద్యులకు ఏంచేయాలో అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకు ఏలూరులో వింత రోగం బారిన పడి 510 మంది ఆస్పత్రి పాలయ్యారు.
అంతుపట్టని వ్యాధి ఏలూరుపై పంజా విసురుతోంది. వ్యాధి గ్రస్తులు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. కొందరికి మూర్ఛ.. మరికొందరికి వాంతులు.. ఇంకొందరిలో నోట్లో నురగ. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా వందలాది మంది ప్రజలు వింత వ్యాధితో అల్లాడిపోతున్నారు. రోజులు గడిచేకొద్ది కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు ప్రాణాలు విడిచారు. అసలు ఏలూరులో ఏం జరుగుతోంది. ఈ వ్యాధి సోకడానికి కారణం నీళ్లా.. పాలా.. వైద్య బృందాలు ఏమంటున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితిని ప్రభుత్వాలు ఎలా డీల్ చేయబోతున్నాయి.
ఏలూరు ప్రజలను ఓ వింత రోగం వణికిస్తోంది. ప్రజలకు ఏ జరుగుతుందో అర్థమ్వడం లేదు. వైద్యులకు ఏంచేయాలో అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకు ఏలూరులో వింత రోగం బారిన పడి 510 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇందులో 322 మంది డిశ్చార్జి చేయగా 17 మందిని విజయవాడకు తరలించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టినా.. స్థానిక ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసినా.. ప్రజలు ఆందోళన విడడం లేదు. కొందరైతే.. ఊళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు.
ఏలూరు ప్రజలను వేధిస్తున్న వింత వ్యాధి గుట్టు ఎంటో తెలుసుకోవడానికి పేషంట్ల బ్లడ్ శాంపిల్స్ ను ఎయిమ్స్ వైద్యులు పరీక్షించారు. అస్వస్థతకు లెడ్ హెవీ మెటల్ కారణమని వైద్యులు నిర్ధించారు. తాగునీరు, పాల ద్వారా శరీరంలోకి లెడ్ వెళ్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు. వెంటనే వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడిగారు.
ఏలూరు అలజడిపై కేంద్రం అలర్ట్ అయ్యింది. ముగ్గురితో కూడిన కేంద్ర వైద్య బృందాన్ని ఏలూరుకు పంపించింది. ఈ బృందం ఏలూరులో పర్యటించి, బాధితులను పరిశీలించనున్నారు. ఏలూరు ప్రజల అస్వస్థతపై విచారణ చేసి సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదిక అందించాలని కేంద్రం ఈ బృందాన్ని ఆదేశించింది. న్యూఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ జంషెడ్‌నాయర్, పుణెకుచెందిన ఎన్‌ఐవీ, వైరాలజిస్ట్ అవినాశ్ డియోస్టవర్, ఎన్సీడీసీ పీహెచ్ డిప్యూటీ డైరెక్టర్ సంకేత్ కుల్కామి ఈ బృందంలో ఉన్నారు.
ఇప్పటికే ఏలూరు ప్రభుత్వాస్పత్రిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సందర్శించారు. ఈ సంస్థకు చెందిన డాక్టర్ భవానీ, డాక్టర్ హర్షిత్ సోమవారం రాత్రి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి అధికారులతో రోగుల ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ఈ ప్రతినిధులు నేడు ఏలూరు నగరంలోని ఆయా ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వానికి,
మరోవైపు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు. ఏలూరులోని దక్షిణ వీధిలో గుర్తించిన ఈవ్యాధి క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐతే దోమల మందు దీనికి కారణమై ఉంటుందా అన్న కోణంలో అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్గానో క్లోరినో అనే రసాయనం కారణమై ఉండొచ్చని మరికొందరు చెప్తున్నారు.