AP Pension Distribution: సాయంత్రంలోగా 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి లక్ష్యంగా AP సర్కార్
NTR Bharosa Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు.
NTR Bharosa Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 82 వేల మంది లబ్ధిదారులు ఉండగా.. 2 వేల 737 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం.
ఉదయం ఆరు గంటల వరకే గ్రామ, సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. సాయంత్రానికి 96 శాతం, రేపటికి వంద శాతం పెన్షన్లు అందజేయాలని సూచించింది ప్రభుత్వం. మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.