Sajjala: చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు లేదు.. పురంధేశ్వరి బాబును విడిపించే ప్రయత్నం చేస్తున్నారు..
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బాబు అరెస్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు 300 కోట్లు కాజేశారని ఆరోపించారు. పూర్తి ఆధారాలున్నందునే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలిపారు.
పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ... చంద్రబాబును విడిపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు సజ్జల. లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నాడో అర్థం కావడం లేదు. అమరావతి అంతా కుట్రనే. అన్ని వ్యవస్థలను మోసం చేశారు. తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలు మోహం చాటేస్తున్నారు. సొంతపార్టీ నేతలే టీడీపీని పట్టించుకోవడం లేదు. జాకీలు పెట్టి లేపిన టీడీపీ పార్టీ లేవదు అని సజ్జల పేర్కొన్నారు.