Andhra Pradesh: ఒంగోలు రిమ్స్‌ హాస్పిటల్లో నో బెడ్స్

Andhra Pradesh: ఆస్పత్రిలో సరిపడా బెడ్లు లేక కోవిడ్‌ బాధితులు అవస్థలు

Update: 2021-04-24 08:39 GMT

ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: కరోనా మహమ్మారి సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. వైరస్ బారిన పడినవారు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాధితుడిని వదిలి వెళ్లలేరు. అలా అని కలిసి కూర్చోలేరు. మరోవైపు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, ఆస్పత్రుల్లో ఉన్న పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో వందలాది బెడ్లు ఉన్నాయని ప్రకటనలే తప్ప.. అలా జరగడం లేదు. దానికి నిదర్శనమే ఈ దృశ్యాలు.

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు కంటనీరు పెట్టిస్తున్నాయి. హాస్పిటల్‌ దగ్గర బారులు తీరారు కోవిడ్ పేషెంట్లు. బెడ్లులేకపోవడంతో నేలపైనే పడుకుంటున్నారు రోగులు. ఆ పక్కనే ఆక్సిజన్‌ సిలిండర్లను పెట్టుకొని వైద్యం తీసుకుంటున్నారు. అంతేకాదు. ఆస్పత్రి ముందు 108, అంబులెన్స్‌, రేకుల షెడ్లు.. ఇలా ఏది అనుకూలంగా ఉంటే.. దానిని వాడుకుంటూ చికిత్స చేస్తున్నారుడాక్టర్లు.

మరోవైపు.. రోగుల కోసం వచ్చిన బంధువులు భౌతికదూరం పాటించకపోవడం.. ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికక్కడ గుంపులుగా సంచరిస్తుండడంతో వైరస్‌ క్యారియర్‌గా మారే ప్రమాదమూ పొంచి ఉంది. దీనిద్వారా మరింత మంది వైరస్‌ బారిన పడే ఛాన్స్‌ పుష్కలంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం.. లెక్కలు కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు రోగుల బంధువులు.

Tags:    

Similar News