తిరుపతిలో హృదయాలయ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి గడ్కరీ

Nitin Gadkari: పేదలకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు అభినందనీయం

Update: 2023-07-13 11:16 GMT

తిరుపతిలో హృదయాలయ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి గడ్కరీ

Nitin Gadkari: వైద్య రంగంలో టీటీడీ చేస్తున్న కృషి చాలా‌ గొప్పదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు. ఆసుపత్రిలోని ఐసీ‍యూ, ఔట్‌పేషెంట్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులను కేంద్ర మంత్రి పరిశీలించారు.

టీటీడీ ఆధ్వర్యంలోని చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిలో నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు దాదాపు 16వందల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు ఉచితంగా చేశారని, దీనిని భగవంతుని సేవగా గడ్కరీ అభివర్ణించారు.

Tags:    

Similar News