సీఎం జగన్ కు నీతి ఆయోగ్ ప్రశంస
Niti Aayog: దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో నీతి ఆయోగ్ జాతీయ సదస్సు నిర్వహించింది.
Niti Aayog: దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో నీతి ఆయోగ్ జాతీయ సదస్సు నిర్వహించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం తీరుతెన్నులపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ స్థాయిలో చేపట్టేందుకు జర్మనీ 20 మిలియన్ యూరోల సాయం చేస్తోందన్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను ఏపీ ఆచరణలో పెట్టిందని, ఈ దిశగా అద్భుతమైన చర్యలు తీసుకున్నారని కొనియాడారు. ఏపీలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించానన్నారు. రైతులకు ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.